Site icon HashtagU Telugu

Upasana: అమెరికాలో డెలివరీ గురించి క్లారిటీ ఇచ్చిన ఉపాసన.. ఇంతకు డెలివరీ ఎక్కడంటే?

Upasana Gold11677597992

Upasana Gold11677597992

Upasana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, మెగా వారి కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ దంపతులు తమ ప్రేగ్నెంట్ గురించి ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ వారసుడు కోసం తెగ ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఉపాసనం బేబీ బంప్ పై బాగా దృష్టి పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఉపాసనకు జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే కొన్ని రోజుల నుండి ఉపాసన డెలివరీ అమెరికాలో అవుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరిగాయి. ఇటీవలే రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోస్తవంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లగా.. అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ పాల్గొన్నాడు.

ఆ సమయంలో యాంకర్ అయినా గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ రాంచరణ్ వ్యక్తిగత గురించి ప్రశ్నించింది. ఇక చరణ్.. ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది అని.. ఆ సమయంలో మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది అని అన్నాడు. దాంతో ఆమె వెంటనే కచ్చితంగా అంటూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయనుండటం తనకు గౌరవం అని.. దానికోసం ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధమే అని తెలిపింది.

అప్పటినుంచి ఉపాసన అమెరికాలో డెలివరీ అవుతుంది అని వార్తలు జోరుగా వచ్చాయి. అయితే ఉపాసన ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చేసింది. డాక్టర్ జెన్నీఫర్.. మీరు చాలా స్వీట్.. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ.. దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్ కుటుంబంలో భాగం అవ్వండి అని కోరింది. అంతేకాకుండా డాక్టర్ సుమన మనోహర్, రూమా సిన్హా తో కలిసి తమ బేబీని డెలివరీ చేయండి అంటూ ట్వీట్ చేసింది. అంటే ఉపాసన డెలివరీ ఇండియాలోనే అవుతుంది అని అర్థమవుతుంది.

Exit mobile version