Site icon HashtagU Telugu

Dr. Prathap C Reddy: తన తాతయ్య బయోపిక్ తీస్తానంటున్న ఉపాసన.. హీరోగా చెర్రీ నటించనున్నాడా?

Mixcollage 06 Feb 2024 11 18 Am 6020

Mixcollage 06 Feb 2024 11 18 Am 6020

టాలీవుడ్ మీద పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య డా. ప్రతాప్ చంద్ర రెడ్డి గురించి అందరికి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ గా దేశ విదేశాల్లో అపోలో సేవలని అందించడంతోపాటు ఆ సేవలను విస్తరించి హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతిని గడించారు ప్రతాప్ చంద్ర రెడ్డి. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే తనకు లైఫ్ లో తన తాతయ్యే స్ఫూర్తి అనే ఉపాసన గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన కూడా ప్రస్తుతం అపోలో భాద్యతలు చూసుకుంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన తన తాతయ్య ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ పుట్టిన రోజు సందర్భంగా ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేసింది. కాగా ప్రతాప్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు.. ఇలా అనేక అంశాలతో రాసిన పుస్తకం ది అపోలో స్టోరీ. పుస్తకం లాంచ్ చేసిన అనంతరం ఆమె ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేసిన సందర్భంగా మీడియా అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. తన తాతయ్య గురించి, అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారు అని మాట్లాడింది.

 

ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పుస్తకం తీసుకొచ్చారు, బయోపిక్ ఏమైనా చేసే ఆలోచన ఉందా అని మీడియా అడగగా అవును, భవిష్యత్తులో అది జరగవచ్చు అని తెలిపింది. మరి రామ్ చరణ్ అందులో నటిస్తాడా అని అడగగా అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సందర్భంగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version