Site icon HashtagU Telugu

Upasana Ramcharan: ‘‘మిస్టర్ -సీ’’ కోసం గోల్డెన్ టెంపుల్ లో ఉపాసన

Upasana

Upasana

ఉపాసన కొణిదెల…సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మెగాపవర్ స్టార్ కు సంబంధించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. లేటెస్టుగా Mister-c కోసం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు ఉపాసన. అంతేకాదు కొన్ని ఫోటోలను కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే…ఉపాసన అమృత్ సర్ లోని గోల్డెన్ టంపుల్ కు వెళ్లారు. అక్కడ తన భర్త రాంచరణ్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.

ఈ వీడియోకు ఇంట్రెస్టింగ్ పోస్టును కూడా యాడ్ చేశారు.కృతజ్ఞతా భావంగా మిస్టర్ సి అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్లో లంగర్ సేవలను నిర్వహించాము. ఆయన RC15షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ సేవలో చరణ్ తరపున పాల్గొనే ప్రత్యేక అవకాశం నాకు లభించింది. చరణ్ నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. దీన్ని వినయముతో అంగీకరిస్తున్నాము అంటూ గోల్డెన్ టెంపుల్ లో నిర్వహించే ప్రత్యేక పూజకు సంబంధించి విశేషాలను ఉపాసన వెల్లడించారు. RRRరిలీజ్ కు ముందు రాంచరణ్ రాజమౌళి, ఎన్టీఆర్ అండ్ టీం గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ తర్వాత శంకర్ డైరెక్షన్ లో రాంచరణ్ ఓ భారీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు పంజాబ్ లో జరుగుతోంది.

Exit mobile version