Site icon HashtagU Telugu

Upasana : ప్రత్యూష గరిమెళ్ల సూసైడ్ పై ఉపాసన ఎమోషనల్ ట్వీట్..!!

upasana

upasana

హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల గురించి హీరో రాంచరణ్ భార్య ఉపాసన భావోద్వేగభరిత ట్వీట్ ను పోస్ట్ చేశారు. ప్రత్యూషను ఉపాసన తన డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. ప్రత్యూష చాలా త్వరగా వెళ్లిపోయిందని..ఆమె మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ పోస్టులో ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యూష…ప్రతివిషయంలోనూ ఉన్నతంగానే ఆలోచించేవారని..కెరీర్ పరంగా, కుటుంబం, స్నేహితుల విషయంలోనూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేదని ఉపాసన పేర్కొన్నారు. అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్ కు గురికావడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ప్రత్యూష ఆత్మకు శాంతిచేకూరని ఉపాసన ఆకాంక్షించారు. తనతో కలిసి ప్రత్యూష దిగిన ఫోటోను ట్వీట్ కు జత చేశారు ఉపాసన.