UP: అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి

  • Written By:
  • Publish Date - December 24, 2021 / 10:51 AM IST

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో అలహాబాద్ హై కోర్టు ప్రధాని నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా కు పలు సూచనలు చేసింది. డెల్టా వేరియెంట్ కంటే ఓమిక్రాన్ మూడు రేట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వెంటనే ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులను రద్దు చేయాలనీ కోరింది. అవసరమైతే ఫిబ్రవరిలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరింది.

జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ గురువారం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు నిర్వహించే మీటింగులలో సోషల్ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కాదని, సెకండ్ వేవ్ ను మించిన ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. యూపీ స్థానిక ఎన్నికల్లో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రచార సభల ధ్వారానే కేసులు పెరిగి భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయని నేపథ్యంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని కోరారు. బతికి ఉంటె భవిష్యత్తులో ఎలెక్షన్లు నిర్వహించుకోవచ్చు అని సూచించారు.