Rape : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన దారుణ ఘటనకు 24 గంటలలోనే సమాధానం ఇచ్చారు పోలీసులు. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దీపక్ వర్మను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. నిందితుడిపై ఇప్పటికే పలుమార్లు క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి లక్నోలో ఓ బ్రిడ్జి కింద తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని దీపక్ వర్మ అనే వ్యక్తి అపహరించాడు. రాత్రిపూట తల్లి గమనించకముందే మాయమయ్యాడు. చిన్నారి గల్లంతైనట్టు తెలుసుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ మానవ వేట ప్రారంభించి, వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
అపహరించిన తరువాత, చిన్నారిపై లైంగిక దాడి జరిపిన నిందితుడిని మంగళవారం తెల్లవారుఝామున పోలీసులు వెదకసాగారు. ఆ సమయంలో ఆయన పోలీసులకు ఎదురయ్యాడు. లొంగిపోవాలని సూచించగా, దీపక్ వర్మ పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. తనరక్షణలో ఉన్న పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడి అతన్ని మట్టుబెట్టారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లోనే తుడిచిపెట్టేయడంతో స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
దీపక్ వర్మపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే తీరులో అతను మళ్లీ మరో అమానుషానికి పాల్పడ్డాడని, ఈసారి రాష్ట్రం వదిలి పెట్టలేదని వారు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ పోలీసు వ్యవస్థకు గర్వకారణంగా నిలుస్తోంది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే దుర్మార్గులకు ఇక ఎక్కడా ఆదరణ లేదన్న సంకేతాన్ని ఈ ఘటన పంపించింది.
Etela Rajender : కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం..?.. ఈటల సంచలనం