Minor Jailed : యూపీ బాలుడికి 20 ఏళ్లు జైలు.. ఎందుకంటే..

ఉత్తరప్రదేశ్ లోని మధుర కోర్టు ఒక బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017 సంవత్సరం ఫిబ్రవరి 15న బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఈ తీర్పును ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 12:00 PM IST

ఉత్తరప్రదేశ్ లోని మధుర కోర్టు ఒక బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017 సంవత్సరం ఫిబ్రవరి 15న బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఈ తీర్పును ప్రకటించింది. నేరానికి పాల్పడిన సమయంలో నిందితుడు మైనరే అయినప్పటికీ.. ఆ నేర తీవ్రత దృష్ట్యా 20 ఏళ్ల శిక్ష విధించారని కోర్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐపీసీలోని 376, 377, 323 సెక్షన్లు.. పొక్సో చట్టంలోని సెక్షన్ 5, 6 కింద బాలుడిపై అప్పట్లో అభియోగాలు నమోదయ్యాయి. పొక్సో చట్టంలోని ఒక్కో సెక్షన్ కింద బాలుడిపై రూ.50వేలు జరిమానా విధించారు. దాన్ని కట్టని ప్రతిసారి.. అదనంగా మరో 6 నెలలు చొప్పున శిక్ష పెరుగుతుందని తీర్పులో పేర్కొన్నారు. ఐపీసీలోని సెక్షన్ 323 కింద బాలుడికి ఏడాది జైలు శిక్ష తో పాటు రూ.10వేలు జరిమానా విధించారు. ఈ జరిమానా చెల్లించకుంటే..శిక్షను మరో రెండు నెలలు పెంచాలని తీర్పు ఇచ్చారు. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయి.