Site icon HashtagU Telugu

Unnao Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు..!

Unnao Road Accident

Unnao Road Accident

Unnao Road Accident: ఉన్నావ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Unnao Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు చనిపోయారు. డబుల్ డెక్కర్ బస్సు పాల కంటైన‌ర్‌ను వెనుక నుంచి ఢీకొట్ట‌డంతో ఈ ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న బస్సు,, పాల కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతోఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగినట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో 18 మంది మృతి చెంద‌గా.. 30 మందికి పైగా గాయపడ్డారు.

బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన తర్వాత క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి పాల కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా ఉండడంతో గ్రామస్తులు చూసి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, ఉన్నావ్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఓ బంగార్మావ్ అరవింద్ చౌరాసియా నేతృత్వంలో పోలీసులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Also Read: IRS Officer : ఐఆర్ఎస్ అధికారిణి సంచలన నిర్ణయం.. మహిళ నుంచి పురుషుడిగా మారిన వైనం

గాయపడిన వారందరినీ ఆసుపత్రిలో చేర్పించారు

లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామం ముందు ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన అనంతరం క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరికీ చికిత్స కొనసాగుతోంది. ఈ వార్త వ్రాసే వరకు వారి పరిస్థితిపై ఎటువంటి అప్‌డేట్ లేదు.

పోలీస్ సూపరింటెండెంట్ ఉన్నావ్, ఏరియా ఆఫీసర్ బంగార్మావ్, ఇతర పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు. బస్సు సంఖ్య UP95 T 4720, పాల కంటైనర్ సంఖ్య UP70 CT 3999. మృతి చెందిన వారిలో 14 మందిని గుర్తించారు. మరణించిన వారిలో మీరట్‌కు చెందిన దిల్షాద్, శివహార్‌కు చెందిన రజనీష్, లాల్‌బాబు దాస్, రాంప్రవేష్ కుమార్, భరత్ భూషణ్ కుమార్, బాబు దాస్, సద్దాం, ఢిల్లీకి చెందిన నగ్మా, షబానా, చాందిని, మహ్మద్ తౌఫిక్ ఆలంగా గుర్తించారు. మరణించిన నలుగురు ప్రయాణికులను ఇంకా గుర్తించలేదు.

We’re now on WhatsApp. Click to Join.