Site icon HashtagU Telugu

Lisa Franchetti: అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ.. ఎవరో తెలుసా?

Lisa Franchetti

Lisa Franchetti

ఇటీవలె అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్ లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. అయితే జో బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు, కానీ అందుకు అమెరికా సెనేట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో యూఎస్ కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలు ఉంటాయి.

కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్ లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలను అందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారి ఈమె కావడం విశేషం. ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్లో గ్రీన్ సిగ్నల్ వస్తే అమెరికా నావీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలుస్తారు అని తెలిపారు.

రిపబ్లికన్ లకు అమెరికా నౌకాదళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు జో బైడెన్.

Exit mobile version