తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్న నేపథ్యంలో, తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఆ ఆరోపణల్లో నిజం ఉందని అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు జరిగాయని, ఇది రాజకీయ కుట్రగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ తగిన సమాధానం ఇవ్వాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Flight Services : సింగపూర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు – చంద్రబాబు
సీఎం రమేష్, కేటీఆర్ మధ్య జరిగిన వార్ ఓపెన్ డిబేట్ స్థాయికి చేరాయి. కేటీఆర్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఢిల్లీలో తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయగల సమర్థత తనకుందంటూ సీఎం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితను జైలులో నుంచి విడిపించేందుకు బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్టు తన వద్ద ఆధారాలున్నాయంటూ ఆరోపించారు. ఇదంతా అవాస్తవమైతే కేటీఆర్ ప్రత్యక్షంగా నిరూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం ఆపి ముందు సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని, సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించాలన్నారు. మొత్తం మీద కేటీఆర్ , సీఎం రమేష్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అందర్నీ మాట్లాడుకునేలా చేస్తుంది.