Site icon HashtagU Telugu

Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి ప్రాణహాని

Nitin Gadkari

New Web Story Copy 2023 05 16t173348.235

Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తుంది. దీంతో మంత్రి కార్యాలయం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది.సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది.

నితిన్ గడ్కరీకి సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని తన నివాసానికి బెదిరింపు కాల్ రావడంతో దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు. మంత్రి నివాసంలోని సిబ్బందితో గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడాడని, మంత్రితో మాట్లాడాలని డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్ డేటా ఆధారంగానే విచారణ చేపట్టామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Read More: Marriage Rumours: మెగా కుటుంబంలో మోగనున్న పెళ్లి భాజాలు.. త్వరలో వరుణ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌?