Site icon HashtagU Telugu

Kishen Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీశైలం సందర్శన..!!

Kishen Reddy

Kishen Reddy

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సందర్శించారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఆవరణలోని గోమాతను భక్తితో పూజించారు.

శ్రీశైలంలో ప్రసాద్ (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive ) పథకం కింద నిర్మించిన యాంఫీ థియేటర్ పట్ల కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళిక లేకుండా ఆలయానికి దూరంగా యాంఫీ థియేటర్ నిర్మాణం ఏంటని అధికారులను ప్రశ్నించారు. యాంఫీ థియేటర్ కు భక్తులు ఎలా వస్తారని అడిగారు. కాగా, యాంఫీ థియేటర్ నిర్మాణానికి రూ.7.99 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది.