కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. ఛాతీలో నొప్పి కారణంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. తదుపరి వైద్యం కోసం మంత్రి కిషన్ రెడ్డిని కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో చేర్చినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కిషన్‌రెడ్డి ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే ఆయన అనుచరులు, పార్టీ నాయకులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నందున భయాందోళనలకు గురికావద్దని ఆయన సన్నిహితులు పార్టీ కార్యకర్తలను కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. ఛాతీలో నొప్పి కారణంగా న్యూఢిల్లీలోని

Kishan Reddy
Last Updated: 01 May 2023, 07:51 AM IST