రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద ఉద్ధృతిపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించిన సీఎం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని షాతో చెప్పారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు సీఎం రేవంత్ కూడా నిన్నటి నుండి వర్షాల ఫై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లతో , అధికారులతో మాట్లాడుతూ తగు చర్యలు తీసుకుంటూ అలర్ట్ చేస్తూ వస్తున్నారు. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. అలాగే, నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కు సైతం అమిత్ షా ఫోన్ చేసారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను , వరద సహాయ చర్యలను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం… ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు. హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
Read Also : Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం