No Tips: హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. ఇకపై సర్వీస్ ఛార్జ్ లకు నో!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి అలా హోటల్ లకు రెస్టారెంట్లకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 10:15 PM IST

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి అలా హోటల్ లకు రెస్టారెంట్లకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే హోటల్ కి రెస్టారెంట్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు బిల్లు తడిపి మోపడుతుంది అనుకుంటే ఆ బిల్లులకు తగ్గట్టుగా సర్వీస్ ఛార్జీలతో కూడా జేబులు ఖాళీ అవుతూ ఉంటాయి. హోటల్ లలో రెస్టారెంట్ లలో బిల్లులు సర్వీస్ చార్జీలు కట్టలేక చాలామంది రెస్టారెంట్ లకు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈమధ్య కాలంలో అయితే హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు వెళ్లిన స‌మ‌యంలో బిల్లుతో పాటు స‌ర్వీస్ చార్జీల పేరిట అదనపు డబ్బులు చార్జీలు వసూలు చేస్తున్నారు.

అయితే ఇదే విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై సర్వీస్ చార్జి పేరిట నుంచి జ‌నానికి ఉప‌శ‌మ‌నం లభించడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం సర్వీస్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తాజాగా ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాకుండా ఇక‌పై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ స‌ర్వీస్ చార్జీల‌ను వ‌సూలు చేయ‌రాదంటూ క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా కాదని సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరికలు జారీ చేసింది.

 

రెస్టారెంట్ లలో హోటల్లలో ఏ బిల్లుకు అయినా జీఎస్టీ ప‌న్ను వ‌సూలు చేస్తున్న నేప‌థ్యంలో స‌ర్వీస్ చార్జీ అనే మాటే మళ్లీ వినిపించకూడదు అని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. వ‌స్తువులు, సేవ‌ల‌పై జీఎస్టీ పేరిట ప‌న్ను వేస్తున్న‌ప్పుడు ఇక హోట‌ళ్లు, రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీల పేరిట అద‌న‌పు ప‌న్ను వేస్తున్న వైనంపై దృష్టి సారించిన కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు స‌ర్వీస్ చార్జీలు వ‌సూలు చేయ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త నిజంగానే ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు.