Telangana: రూ.900 కోట్ల ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా అనేక హామీలను ప్రకటించారు. దశాబ్దాలుగా రైతుల చిరకాల వాంఛ నెరవేర్చుతూ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు ఆమోదం తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Telangana (6)

Telangana (6)

Telangana: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా అనేక హామీలను ప్రకటించారు. దశాబ్దాలుగా రైతుల చిరకాల వాంఛ నెరవేర్చుతూ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా ములుగులో రూ.900 కోట్లతో ఏర్పాటుచేసే వర్సిటీకి సమ్మక్క-సారక్క పేరు పెడుతున్నట్లు మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

అక్టోబరు 1న  ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ములుగులో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది, దీనికి గిరిజన దేవతలైన సమ్మక్క మరియు సారక్క పేరు పెట్టారు. ఈ కార్యక్రమం కోసం 900 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో మోడీ తెలంగాణ పర్యటన చేపట్టారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు.

Also Read: Virat Kohli: వరల్డ్ కప్ క్రికెట్ టికెట్స్ కోసం నన్ను సంప్రదించకండి : విరాట్ కోహ్లీ

  Last Updated: 04 Oct 2023, 03:22 PM IST