Unilever Recalls Dove: ఈ షాంపూలు వాడుతున్నారా.. అయితే క్యాన్సర్‌ బారిన పడినట్లే..!

తన డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్‌, నెక్సస్‌, ట్రెస్మె, టిగీ, సువావేలలో క్యాన్సర్‌ కారక కెమికల్‌ (బెంజీన్‌) ఉందని హిందుస్తాన్‌ యునిలీవర్‌ గుర్తించింది.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 10:29 PM IST

తన డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్‌, నెక్సస్‌, ట్రెస్మె, టిగీ, సువావేలలో క్యాన్సర్‌ కారక కెమికల్‌ (బెంజీన్‌) ఉందని హిందుస్తాన్‌ యునిలీవర్‌ గుర్తించింది. దీంతో వెంటనే మార్కెట్‌ నుంచి భారీగా వీటిని రీకాల్‌ చేసింది. ఏరోసోల్‌ డ్రై షాంపూ ప్రొడక్టులు ప్రమాదకరమని, వాటిని వాడొద్దని వినియోగదారులనూ హెచ్చరించింది. అక్టోబర్‌ 2021కి ముందు తయారైన షాంపూల్లో ఈ హానికర కారకాలున్నాయని FDA వెల్లడించింది. క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ అనే రసాయనంతో కలుషితమైందని గుర్తించిన తర్వాత డవ్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌ల ఏరోసోల్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసు ప్రకారం.. రీకాల్ చేసిన ప్రొడక్ట్స్ లలో Nexxus, Suave, Tresemmé, Tigi వంటి బ్రాండ్‌ లు ఉన్నాయి.

అక్టోబర్ 2021కి ముందు తయారు చేసిన అన్ని ప్రొడక్టులను యూనీలివర్ రీకాల్ చేస్తోంది. రీకాల్ చేసిన షాంపూలలో బెంజీన్ అనే క్యాన్సర్‌కు కారకమయ్యే కెమికల్ ఉన్నట్టు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వార్త బయటికి రాగానే పర్సనల్ కేర్ ప్రొడక్టులలో ఏరోసోల్స్ సేఫ్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాదిన్నరగా ఎన్నో ఏరోసోల్ సన్‌స్క్రీన్లను కూడా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.

మేము చూసిన దాని ప్రకారం.. ఏరోసోల్ డ్రై షాంపూలు, ఇతర ప్రొడక్టుల్లో అత్యధికంగా బెంజీన్ కారకం ఉండటం దురదృష్టకరం. దీనిపై మేము విచారణ చేపడుతున్నాం అని వాలిస్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ అన్నారు. గత డిసెంబర్‌లో ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపూలను కూడా రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ వీటిల్లో ఉన్నట్టు గుర్తించారు. ఏరోసోల్ డ్రై షాంపూలను వెంటనే కస్టమర్లు వాడటం ఆపివేయాలని ఎఫ్‌డీఏ పేర్కొంది.