IIPS Director: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) డైరెక్టర్ సస్పెండ్ కు గురయ్యారు. ఐఐపీఎస్ డైరెక్టర్ కేఎస్ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఐఐపీఎస్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలను నిర్వహిస్తుంది. అయితే ఐఐపీఎస్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైన డేటాతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోవడంతో కేఎస్ జేమ్స్‌ను పదవి నుంచి సస్పెండ్ చేశారు. జేమ్స్ 2018లో ముంబైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. హార్వర్డ్ సెంటర్ ఫర్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ నుండి పోస్ట్‌డాక్టోరల్ డిగ్రీ పట్టా అందుకున్నాడు.
Also Read: Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..