Site icon HashtagU Telugu

Hyderabad: ‘ఇన్ స్టా‘ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్టులు.. ఓయో రూముకు వెళ్లిన ప్రియురాలికి దిమ్మతిరిగే షాక్!

SI Kidnapped Up

Crime

ఈ తరం యూత్ కు సోషల్ మీడియా జీవితంలో భాగమైంది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ (Instagram) లాంటి సోషల్ మీడియాలో గంటలకొద్దీ గడుపుతూ దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఆకర్షణ మోజులో పడి విలువైన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రేమ మోజులో పడిన ఓ యువతి ప్రియుడి డబ్బుల కోసం ఓయూ రూమ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పూర్ణేశ్ యాదవ్ అనే యువకుడు పరిచయం కాగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పూర్ణేశ్ డబ్బులు కావాలని ఈ యువతిని అడిగాడు. అయితే ఆ అమ్మాయి వద్ద డబ్బులు లేకపోవడంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసిన అస్లాం అనే మరో యువకుడిని అడిగింది.

అస్లాం తన వద్ద డబ్బులు లేవని కానీ తనకు తెలిసిన సాయి చరణ్ అనే యువకుడితో ఒకరోజు గడిపితే డబ్బులు ఇస్తాడని చెప్పాడు. వీరంతా కలిసి నారాయణగూడలోని ఓయో రూంలో కలిశారు. అయితే యువతిని నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీసి తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. వేధింపులు భరించలేక ఆ యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మోజులోపడి మోసపోవద్దని పోలీసులు కోరారు.

Also Read: Heroine Dimple: హైకోర్టుకు చేరిన డింపుల్ హయాతి ‘కారు’ పంచాయితీ!

Exit mobile version