ఐపీఎల్2022 మెగా వేలం బెంగళూరులో ఉత్కంఠంగా జరుగుతోంది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికారు. సెట్ 2లో సురేష్ రైనా, మనీష్ పాండే, దేవదూత్ పడిక్కల్, రాబిన్ ఉతప్ప, స్టివ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, హెట్‌మెయర్, జాసన్ రాయ్‌లు ఉన్నారు. వీరిలో హెట్‌మేయర్ గరిష్ఠ ధరకు, 8.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. హెట్‌మేయర్ కనీస ధర 1.5 కోట్లుగా ఉంది. యంగ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ కూడా భారీ ధర పలికాడు. అతన్ని కూడా 7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. పడిక్కల్ కనీస ధర 2 కోట్లుగా ఉంది. మనీష్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర ఒక కోటి.
ఇక రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోంది. అతన్ని కనీస 2 కోట్లు కాగా, అంతే ధరతో చెన్నై సొంతం చేసుంది. జాసన్ రాయ్ కూడా కనీస ధర 2 కోట్లకే అమ్ముడుపోయాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇక సెట్2లో డెవిడ్ మిల్లర్, స్టీవ్ స్మిత్‌లు అమ్ముడు పోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. స్టీవ్ స్మిత్ కనీస ధర 2 కోట్లు కాగా.. డెవిడ్ మిల్లర్ కనీస ధర కోటి రూపాయలు. వీరిని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ సుముఖత చూపకపోవడంతో, వారు అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఇక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సురేష్ రైనా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్స్‌లో 5వేలకు పైగానే పరుగులు చేసి మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేష్ రైనా, తొలిరౌండ్‌లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మిస్టర్ కూల్ ధోనీ సారధ్యంలో చైన్నె సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సీఎస్‌కే కూడా రైనాకు హ్యాండ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.