Unemployment Rate: గ్రామాల్లో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య.. కారణం అదే?

దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు మరొకసారి 8 శాతం పెరిగింది. కాగా ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 8 శాతం పెరగడం ఇది ఏకం

Published By: HashtagU Telugu Desk
Unemployment Rate

Unemployment Rate

దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు మరొకసారి 8 శాతం పెరిగింది. కాగా ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 8 శాతం పెరగడం ఇది ఏకంగా మూడోసారి. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ నిరుద్యోగం కారణంగా భారతదేశం నిరుద్యోగిత రేటు ఈ సంవత్సరం మూడవసారి 8 శాతానికి పైగా పెరిగింది. కానీ ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటులో తగ్గుదల కనిపించింది. అయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎందుకు పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక ప్రకారం జూన్‌లో నిరుద్యోగిత రేటు గత నెలలో 7.68 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. గత నెలలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.87శాతానికి తగ్గింది. గ్రామీణ భారతదేశంలో రెండేళ్లలో అత్యధికంగా 8.73శాతం నిరుద్యోగం ఉంది. సాధారణంగా జూన్ వ్యవసాయ రంగానికి లీన్ సీజన్, ఇది దేశంలోని గ్రామీణ జనాభాకు ప్రధాన జీవనాధారం. భారతదేశంలోని గ్రామాలలో నిరుద్యోగం చారిత్రాత్మకంగా జూన్‌లో పెరుగుతుంది, ఎందుకంటే మేలో పంట కోత ముగుస్తుంది. రుతుపవనాలు ముందుకు సాగిన జూలైలో మాత్రమే కొత్త పంటల విత్తడం వేగవంతం అవుతుంది.

కాగా ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే హామీలో భాగంగా జాబ్ ఆఫర్ లెటర్లను పంపిణీ చేస్తోంది. దీంతో తన పరిపాలనపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ఆందోళన కలిగిస్తోంది.

  Last Updated: 03 Jul 2023, 04:31 PM IST