Under Water Metro Train: త్వరలోనే అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్..ఎప్పుడు, ఎలా?

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో నుంచి మెట్రో రైలు నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ఇంకొన్ని రోజుల్లో జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Underwater Metro Trial Run Soon..when And How..

Underwater Metro Trial Run Soon..when And How..

Under Water Metro Train : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో నుంచి మెట్రో రైలు నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ఇంకొన్ని రోజుల్లో జరగనుంది. వాస్తవానికి గత ఆదివారమే ట్రయల్ రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే.. సొరంగం పనులు పూర్తి కాగానే ట్రైన్ సర్వీస్ ను మొదలు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా హౌరా మైదాన్ , సాల్ట్ లేక్‌ లలోని సెక్టార్ V లను కలుపుతూ తూర్పు – పశ్చిమ మెట్రో (Metro) కారిడార్ మధ్య హుగ్లీ నదికి దిగువన రెండు సొరంగాలను నిర్మించారు. ఈ మార్గంలోని ఒక భాగంలో త్వరలో ట్రయల్ రన్‌ను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) షెడ్యూల్ చేసింది.

ఇందులో భాగంగా రెండు నుంచి ఆరు కోచ్‌లతో కూడిన మెట్రో రైలు “ఎస్ప్లానేడ్ – హౌరా మైదాన్” రూట్ లో 4.8 కి.మీ దూరం ట్రయల్ రన్ చేయనుంది. హుగ్లీ నదీగర్భం నుండి చెక్కబడిన సొరంగాలలో నుంచి మెట్రో (Metro) రైలు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. నది దిగువన ఉన్న మార్గం కవర్ చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ 16 కి.మీ పొడవైన రైలు మార్గంలో 10.8 కి.మీ భూగర్భ విభాగాలు ఉన్నాయి. నది దిగువన ఉన్న భాగం కూడా ఇందులో చేర్చబడింది. ఈ మెట్రో రైలు హుగ్లీ నది దిగువన 13 మీటర్లు వెళుతుంది. హౌరా మెట్రో స్టేషన్ కూడా 33 మీటర్ల లోతు వరకు ఉంటుంది.

కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) ప్రకారం.. భూగర్భ తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. కోల్‌కతా మెట్రో యొక్క ఈస్ట్-వెస్ట్ కారిడార్ పొడవు 15 కిలోమీటర్లు. ఇది హౌరా నుండి సాల్ట్ లేక్ సిటీ స్టేడియం వరకు విస్తరించి ఉంది. సాల్ట్ లేక్ సెక్టార్ 5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు ఈ మెట్రో మార్గంలో కరుణామయి, సెంట్రల్ పార్క్, సిటీ సెంటర్ మరియు బెంగాల్ కెమికల్ వద్ద మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా మెట్రో యొక్క నార్త్-సౌత్ లైన్ యొక్క ఎస్ప్లానేడ్ స్టేషన్‌ను హౌరా మరియు సీల్దాలోని రైల్వే స్టేషన్‌లతో కలుపుతుంది.

ఇక కోల్‌కతా నగరం విషయానికి వస్తే.. ఇది 1984లోనే దేశం యొక్క మొట్టమొదటి మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని చూసింది. ఢిల్లీ నగరం కోల్‌కతా కంటే చాలా ఆలస్యంగా 2002లో మెట్రో ట్రైన్ సేవలను అందించడం ప్రారంభించింది.

లండన్, ప్యారిస్ తరహాలో మెట్రో ట్రైన్

లండన్-పారిస్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ (Under Water Metro Train) తరహాలో కోల్ కతా మెట్రో ట్రైన్ ను నడపనున్నారు. నీటి అడుగున రైలు జర్నీ ప్రారంభమైతే లక్షల మంది ప్రయాణికులకు రోడ్లపై ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. ఈ మెట్రో టెన్నెల్ నిర్మాణానికి దాదాపు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

హౌజ్ ఖాస్ తర్వాత.. కోల్ కతాలోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 మీటర్ల లోతుగా ఉంటుంది. ప్రస్తుతం.. హౌజ్ ఖాస్ 29 మీటర్ల లోతైన స్టేషన్ గా పరిగణించబడుతోంది.

Also Read:  FBI Warning to the Public: మీ ఫోన్ ను పబ్లిక్ ఛార్జర్‌ తో ఛార్జ్ చేస్తున్నారా? FBI ఇచ్చిన వార్నింగ్ చూసుకోండి..

  Last Updated: 11 Apr 2023, 05:20 PM IST