Jobs: జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలపై అవగాహన

Jobs: జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి టామ్ కాం ద్వారా ఈ నెల 7న ఉదయం 10-30 గంటలకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ద్వారా రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 22 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్న […]

Published By: HashtagU Telugu Desk
Nursing Officers

Nursing Officers

Jobs: జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి టామ్ కాం ద్వారా ఈ నెల 7న ఉదయం 10-30 గంటలకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ద్వారా రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 22 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్న బి.ఎస్సీ అర్హత గల నర్సింగ్ గ్రాడ్యుయేట్లు,  జి.ఎన్.ఎం. డిప్లొమా హోల్డర్లు జర్మన్ భాషా తరగతులలో చేరడానికి అవగాహన కార్యక్రమంతో పాటు ఎంపిక ప్రక్రియకు హాజరు కావచ్చునని, ఎలాంటి ముందస్తు పని అనుభవం లేని ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

జర్మన్ భాషపై నివాస శిక్షణ, జర్మనీలో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు టామ్ కాం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు హైదరాబాద్‌లో అందించబడతాయని,  విజయవంతంగా స్థానం పొందిన అభ్యర్థులకు నెలవారీ 1.9 నుండి 2.5 లక్షల వరకు ఇతర అలవెన్సులు, కుటుంబ వీసాలు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల నర్సింగ్ అభ్యర్థులు సెల్ నంబర్  9908830438 నందు సంప్రదించాలని, లేదా టామ్ కాం యాప్‌తో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని ఆయన తెలిపారు.

  Last Updated: 07 Feb 2024, 09:21 AM IST