BRS Minister: ఊరంటే నలుగురు మనుషుల్లో నాలుగు రకాలుగా ఉంటారు, లోకో భిన్న రుచి అనేది నానుడి, ఏ అంశం మీదనైనా ఒక్కొక్కరు తమదైన అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. అలాంటి గ్రామాలు నేడు ఏకతాటిపైకి వస్తున్నాయి, ముక్తకంఠంతో తమ అభిప్రాయాల్ని చెబుతున్నాయి. ఈ విశేషమైన సంఘటనలకు వేదికగా రాష్ట్రంలో నిలిచి అందరికీ ఆధర్శప్రాయంగా నిలుస్తుంది కరీంనగర్ నియోజకవర్గం.
ప్రస్థుత ఎన్నికల సీజన్లో ఏ ఊరెళ్లినా, ఏ రచ్చబండ దగ్గరైనా మా పార్టీ గొప్పదంటే, మా అభ్యర్థి గొప్ప అంటూ తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తుంటే కరీంనగర్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది, చాలా గ్రామాల్లో సబ్బండ వర్ణాలు, సకల జనులు స్వతంత్రంగా ముందుకు వచ్చి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గంగుల కమలాకరే తమ ఎమ్మేల్యే అని, కారు గుర్తునే మా ఓటని ఏకంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.
తాజాగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోనీ ముదిరాజ్ సంఘం నాయకులు గంగుల మద్దతుగా గ్రామ గ్రామాన ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో ఆయ సంఘాల నాయకులు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని గంగుల మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేశారు. పట్టణంలో సైతం ఇదే తరహాలో తీర్మానాలు చేయగా భగత్ నగర్ రెడ్డిసంఘం, మున్నురుకాపు సంఘం నాయకులు తీర్మానం చేశారు.
మూడు పర్యాయాలు వరుసగా గెలిచిన మంత్రి గంగుల, ప్రతీసారి తమ ప్రాంతాన్ని మరింతగా ఊహించని రీతిలో అబివృద్దిలోకి తీసుకెల్తున్నాడని, సీనియర్ రాజకీయవేత్తగా, రాష్ట్ర మంత్రిగా ఉండి సైతం తమకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నాడని అందుకే ఎన్నిసార్లైనా, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన గంగుల కమలాకర్కే తమ ఓటని చాటుతున్నారు. సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే కార్యకర్తల్ని, ఓటేసిన ప్రజల్ని పట్టించుకోండి వారి బాగోగులు గెలుపోటములతో సంబందం లేకుండా చూడండి అనే మాటల్ని ఆచరణలో అమలు చేసే కార్యదక్షుడు గంగుల కమలాకర్ అందుకే వరుస విజయాలతో దూసుకుపోతు ప్రజా మన్ననలు పొందుతున్నారు.