Umran Malik:కశ్మీర్ బుల్లెట్ ఉమ్రాన్ మాలిక్…IPLలో అదరగొడుతున్నాడుగా!!

ప్రస్తుతం జరుగుతున్న IPL-2022 మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ క్రికెట్ లవర్స్ ను ఫిదా చేస్తున్నాడు. సన్ రైజర్ హైదరాబాద్ జట్టులో యువనైపుణ్యానికి కొదవేలేదని చెప్పాలి.

Published By: HashtagU Telugu Desk
Umran Malik

Umran Malik

ప్రస్తుతం జరుగుతున్న IPL-2022 మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ క్రికెట్ లవర్స్ ను ఫిదా చేస్తున్నాడు. సన్ రైజర్ హైదరాబాద్ జట్టులో యువనైపుణ్యానికి కొదవేలేదని చెప్పాలి. ఆ జట్టులో పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలానే ఉన్నారు. వారిలో ఉమ్రాన్ మాలిక్ ఒకరు. ఉమ్రాన్ మాలిక్ కశ్మీర్ కు చెందినవాడు. ఈ స్పీడ్ స్టర్ తన వేగంతో IPLలో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటున్నాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్ కు టెక్నిక్ జోడించడంలో ఇంకా పరిణతి చెందాల్సి ఉందని క్రికెట్ పండితులు అంటున్నారు. అందుకే వికెట్ల వేటలో ఉమ్రాన్ వెకబడుతున్నాడని విశ్లేషిస్తున్నారు.

అసలు విషయానికి వస్తే…ఇవాళ సన్ రైజర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడతుంది. టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ దిగింది. ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలోనే అత్యంత స్పీడ్ బాల్ ను విసిరాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లలో అంబటి రాయుడికి వేసిన ఆ బాల్ 153.1 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. రాయుడు ఆ బాల్ ను ఆడటంలో తడబడ్డాడు. 22 ఏళ్ల ఉమ్రాన్ తన బౌలింగ్ కు మరింత మెరుగులు దిద్దినట్లయితే…భవిష్యత్తులో టీమిండియాకు ఓ సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఎదిగే ఛాన్స్ ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 12 Apr 2022, 02:40 PM IST