Site icon HashtagU Telugu

Russia-Ukraine war: 9166 మంది రష్యా సైనికుల్నిలేపేశారు..!

Ukraine Russia War

Ukraine Russia War

ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్నయుద్ధంలో, రెండు దేశాలు త‌గ్గేదెలే అంటున్నాయి. ర‌ష్యా సైనిక బ‌ల‌గాల దాడికి ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, ర‌ష్యాకు కూడా తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు 9,166 మంది రష్యా సైనికులు హ‌త‌మ‌య్యార‌ని చంపేశామ‌ని ఉక్రెయిన్ ర‌క్ష‌ణ‌శాఖ వెల్ల‌డించింది. ర‌ష్యాకు సంబంధించిన 251 యుద్ధ ట్యాంకులను కూడా ధ్వంసం చేశామని ఉక్రెయిన్ తెలిపింది.

ఉక్రెయిన్‌లో భీభ‌త్సం సృష్టిస్తున్న ర‌ష్యాను ఒంట‌రిగానే ఎదుర‌క్కుటున్నామ‌ని, ఈ క్ర‌మంలో 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని వెల్లడించింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. ఇక ఈ యుధ్ధంలో తమ సైనికులతో పాటు పౌరులు సైతం ప్రాణాల‌కు లెక్క‌చేయ‌కుండా ర‌ష్య‌న్ సైనంతో పోరాటం చేస్తున్నాయ‌ని, ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు లొంగిపోయే చాన్స్ లేద‌ని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది.