Ukraine President: ర‌ష్యాపై వాగ్న‌ర్ గ్రూప్ తిరుగుబాటు.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చెడు మార్గాన్ని అనుస‌రించే ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌ను తామే నాశ‌నం చేసుకుంటార‌ని ర‌ష్యాలో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 08:53 PM IST

గ‌తేడాదిగా ఉక్రెయిన్ (Ukraine) పై దురాక్ర‌మ‌ణ చేస్తోన్న ర‌ష్యా (Russia) లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధ భూమిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌ని పుతిన్ ప్ర‌భుత్వానికి ఇప్పుడు సొంత దేశంలో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. సైనిక చ‌ర్య‌ల్లో ర‌ష్యా బ‌ల‌గాల‌కు అండ‌గా ఉన్న వాగ్న‌ర్ గ్రూప్ (Wagner group) పుతిన్‌ (Putin) పై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసింది. మాస్కోలోని సైనిక నాయ‌క‌త్వాన్ని కూల‌దోసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వాగ్న‌ర్ సేన అధిప‌తి యోవ్‌గేనీ ప్రిగోజిన్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వాగ్న‌ర్ సైన్యం రోస్టోవ్ న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 25వేల మంది వాగ్న‌ర్ సేన‌లు రాజ‌ధాని మాస్కోవైపు దూసుకెళ్తున్నాయి. దీంతో మాస్కోలో ర‌ష్యా సైన్యం అప్ర‌మ‌త్త‌మైంది.

అనూహ్య ప‌రిణామంతో ర‌ష్యా అధినాయ‌క‌త్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాజ‌ధాని మాస్కోతో స‌హా ర‌ష్యాలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్ట చేశారు. వాగ్న‌ర్ సైన్యాన్ని నిలువ‌రించేందుకు ర‌ష్యా త‌న సొంత న‌గ‌రంపైనే దాడి చేయాల్సి వ‌చ్చింది. వొరొనెజ్‌లోని ఆయిల్ రిఫైన‌రీ, డిపోపై బాంబు దాడి చేసిన‌ట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో భారీగా ఎగ‌సిప‌డిన మంట‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలాఉంటే ర‌ష్యాలో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

చెడు మార్గాన్ని అనుస‌రించే ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌ను తామే నాశ‌నం చేసుకుంటార‌ని అన్నారు. చాలాకాలంగా ర‌ష్యా త‌న బ‌ల‌హీన‌త‌ను, ప్ర‌భుత్వ మూర్ఖ‌త్వాన్ని క‌ప్పిపుచ్చింది. ఇప్పుడు ఏం దాచిపెట్ట‌లేని విధంగా అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీనంత‌టికి ఒక వ్య‌క్తే కార‌ణం. పూర్తిస్థాయిలో ర‌ష్యా బ‌ల‌హీనత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మాస్కో త‌న బ‌ల‌గాల‌ను, కిరాయి సైన్యాల‌ను ఉక్రెయిన్‌లో ఎంత ఎక్కువ‌కాలం ఉంచుతుందో .. అంత ఎక్కువ న‌ష్టాలు, స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది అని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. తాము పూర్తి సామ‌ర్థ్యంతో, ఐక‌మ‌త్యంగా ముందుకు సాగుతామ‌ని, మున్ముందు ఏం చేయాలో త‌మ బ‌ల‌గాల‌కు తెలుస‌ని జెలెన్ స్కీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Fight for Mangos : లండన్‌లో మామిడి పండ్ల కోసం.. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు..