Site icon HashtagU Telugu

Ukrainian nurse:రెండు కాళ్లు కోల్పోయిన నర్సు తన భర్తతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్!!

ukraine nurse

ukraine nurse

నిజమైన ప్రేమ అన్నింటినీ జయిస్తుంది. అందర్నీ ఎదురిస్తుంది. కలిసి జీవించాలని కలలు కన్నారు. తొందర్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరకున్నారు. ఈ ప్రయాణంలో అనుకోని సంఘటన. వారి జీవితాలను అందకారంలోకి నెట్టింది. దానికి కారణం…రష్యా ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్దం. అవును..

23ఏళ్ల ఒక్సానా నర్సుగా ఉక్రెయిన్ లో పనిచేస్తుంది. ఆమె విక్టర్ తో ప్రేమలో పడింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా వీరి ప్రేమ కొనసాగుతోంది. మార్చి 27న తన ప్రేమికుడు విక్టర్ తో కలిసి ఒక్సానా లుహాన్స్క్ ప్రాంతంలోని తన స్వస్థలమైన లైసిచాన్స్ లో నడుచుకుంటూ వెళ్తుండగా ల్యాండ్ మైన్ పై కాలు పడింది. ఈ ల్యాండ్ మైన్ పేలడంతో ఒక్సానా తన రెండు కాళ్లు ..ఎడమ చేతి నాలుగు వేళ్లను కోల్పోయింది.అయితే ఈ దాడి నుంచి విక్టర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒక్సానాకు శస్త్రచికిత్స చేసి రెండు కాళ్లను తీసివేశారు. ఇప్పుడు ఆమె కోలుకుంది. నాలుగు రోజుల క్రితం విక్టర్ ఒక్సాను ఆసుపత్రికి వెళ్లి కలిసాడు. ప్రేమతో ఆలింగం చేసుకున్నాడు. తన జీవిత భాగస్వామితో విక్టర్ సంతోషంగా డ్యాన్స్ చేశాడు. ఒక్సానా వైట్ కలర్ డ్రెస్సు ధరించగా..ఈ జంట కోసం  ఎల్విన్ మెడికల్ అసోసియేషన్ ఉంగరాలను అందించింది. ఆసుపత్రిలోని వాలంటీర్లు కేక్ ను రెడీ చేశారు. సర్జరీ సెంటర్  వార్డులో వీరి వివాహం ఘనంగా జరిగింది.  ఈ వీడియోను ఆసుపత్రిలోని ఓ వాలంటీర్ కెమెరాలో బందించాడు. ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్లో షేర్ చేశారు. చాలా ప్రత్యేకమైన ప్రేమకథ అంటూ అభివర్ణించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.