Site icon HashtagU Telugu

Ukraine Russia War: పుతిన్‌కు షాక్.. 5,840 రష్యా సైనికుల‌ను లేపేసిన ఉక్రెయిన్..!

Russia Army

Russia Army

ఉక్రెయిన్‌ ఆక్రమణలో భాగంగా రష్యా దూకుడు పెంచింది. మంగళవారం నుంచి దాడుల్ని ముమ్మరం చేసిన రష్యా బలగాలు.. పౌరులున్నారని కూడా చూడకుండా క్షిపణి, బాంబులు, బుల్లెట్లతో విరుచుకుపడుతున్నాయి. మ‌రోవైపు ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాలు ర‌ష్యా సైనిక ద‌ళాలకు అంత ఈజీగా లొగ‌డంలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఉక్రెయిన్ సైనికులే కాదు.. రష్యా కూడా భారీగానే నష్టపోయిందని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వేల‌మంది ర‌ష్యా సైనుకుల‌ను ఉక్రెయిన్ సైన్యం మ‌ట్టి క‌రిపించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఉక్రెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యాకు జ‌రిగిన న‌ష్టాన్ని ఉక్రెయిన్ సైన్యం అంచ‌నా వేసింది. దీనికి సంబంధించిన‌ సమాచారం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో జోరుగా ప్ర‌చారం అవుతోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో రష్యా వార్ ప్ర‌క‌టించినప్ప‌టి నుండి జ‌రుగుతున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 5,840 రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, 211 ట్యాంకులు, 862 సాయుధ పెట్రోలింగ్ వాహనాలు (ఏపీవీ), 85 ఫిరంగి వ్యవస్థలు, 9 విమాన నిరోధక (యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్) వ్యవస్థలు, 60 ఇంధన ట్యాంకులు, 355 వాహనాలు, 40 ఎంఎల్ఆర్ఎస్ రాకెట్ లాంచర్లు (పట్టుబడ్దవి).. ఉక్రెయిన్ వాదన ప్రకారం ఇప్పటివరకు రష్యాకు జరిగిన నష్టం అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.