Site icon HashtagU Telugu

Ukraine Crisis : ఉక్రెయిన్ లోని భార‌తీయుల త‌ర‌లింపు

Japan Pm

Japan Pm

ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య యుద్ధం ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల‌ను ర‌ష్యా ఆక్ర‌మించింది. అక్క‌డికి ర‌ష్యాల ద‌ళాలు వెళ్లాయి. దీంతో యుద్ధం జరుగుతుందనే భయంతో ఉక్రెయిన్ దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల కోసం భార‌త తర‌లింపు చర్యను ప్రారంభించింది. మంగ‌ళ‌వారం ఉదయం 7:40 గంటలకు ఎయిర్ ఇండియా తొలి ప్రత్యేక విమానం ఉక్రెయిన్‌కు వెళ్లింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ కోసం భారతదేశం 200 కంటే ఎక్కువ సీట్లతో డ్రీమ్‌లైనర్ B-787 విమానాలను మోహరించింది. ఇది కాకుండా, ఫిబ్రవరిలో భారతదేశం నుండి మరో రెండు విమానాలు వెళ్ల‌నున్నాయి. రెండవ విమానం ఉక్రెయిన్‌కు ఫిబ్రవరి 24న మరియు మూడవది ఫిబ్రవరి 26న పంప‌డానికి భార‌త్ ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్ దేశంలోని రెండు స్వతంత్ర నగరాలుగా ప్రకటించడంతోపాటు సైన్యాన్ని పంపాలని ర‌ష్యా ఆదేశించింది. ఆ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ రష్యాతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిణామాలలో ఈ ప్రాంతం యొక్క శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది.ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు మరియు పౌరులు నివసిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత. ఇరువైపులా సంయమనం పాటించాలని, దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భార‌త్ కోరుకుంటోంద‌ని మూర్తి అన్నాడు.