Site icon HashtagU Telugu

UK Minister Porn: పార్లమెంట్ లో పోర్న్ చూసిన సీనియర్ మంత్రి..హవ్వా అదేం పని..!!

Commons Imresizer

Commons Imresizer

బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువసభను…హౌజ్ ఆఫ్ కామర్స్ అని పిలుస్తారు. కొన్ని నెలలుగా…ఆ మంత్రి..ఓ సభ్యురాలి పక్కన కూర్చుని..తన ఫోన్లో పోర్న్ చూస్తున్నట్లుగా బుధవారం ఓ వార్త బయటకుపొక్కింది. ఆయన ఓ సీనియర్ నేత కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనను అధికార పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. పార్లమెంట్ లోని ఐసీజీఎస్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆరోపణలు నిజమైనట్లయితే…మంత్రిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం.

అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనలపై ఈ మధ్యకాలంలో తీవ్రస్థాయి ఆరోపణలు వెలువడుతున్నాయి. 56 ఎంపీలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వీరిలో ముగ్గురు ప్రస్తుతం ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఉన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి…ఓ కన్జర్వేటివ్ ఎంపీ ఈ మధ్యే వార్తల్లో నిలిచారు. లైంగిక వేధింపులు అనేవి సహించారని నేరాలు. అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఓప్రక్రియ ఉంటుందని స్వయంగా బోరిస్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి పార్లమెంట్ లో స్థానం లేదని వెల్లడించారు.

కాగా బోరిస్ పైన్నే ప్రస్తుతం పలు ఆరోపణలు ఉన్నాయి. అవి లైంగిక వేధింపులు కాకపోయినప్పటికీ…లాకౌడౌన్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు నిర్వహించారని ఆయనపై జరిమానా పడింది. ఇలాంటి పరిణామాల మధ్యే కన్జర్వేటివ్ పార్టీ మే 5న స్థానిక ఎలక్షన్స్ కు రెడీగా ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా లేదా అనేది చూడాల్సిందే. ఆరోపణలన్నీ నిజం అయితే బోరిస్ రాజీనామాకు డిమాండ్స్ పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.