అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. చాలామంది ఇలా అదృష్టం కలిసి రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు. అయితే ఇలా రాత్రికి రాత్రికి కలిసొచ్చి కోటీశ్వరులుగా మారిపోవడం అన్నది చాలా తక్కువ మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇలా వేరే వాళ్ళ జీవితాల్లో జరిగింది అనుకున్నప్పుడు చాలామంది మా జీవితంలో కూడా ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. తాజాగా ఒక జంట విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పవచ్చు. ఒక యూకే లోని ఒక జంట రాతికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నార్త్ యార్క్ షైర్ లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇళ్లు ఉంది. దీంతోఆ జంట తమ పాతబడిన ఇంటిని బాగుచేసుకోవాలి అనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంట్లోని కిచెన్‌ను బాగుచేయడం కోసం తవ్వకాలు జరపగా అనుకోకుండా వారు తవ్వకాలు జరుపుతున్న ఒక ప్రదేశంలో గునపానికి ఏదో తగిలిన శబ్ధం రావడంతో షాక్ అయ్యారు. దాంతో అనుమానం వచ్చి మరింత లోపలికి తవ్వగా అక్కడ ఓ లోహపు క్యాన్ కనిపించింది. క్యాన్‌ను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా ఒకసారిగా ఆ జంట షాక్ అయ్యారు. ఆ క్యాన్ లో బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.
అందులో ఉన్న ఆ బంగారు నాణేలు 1610 – 1727 నాటికీ చెందినవి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. ఆ జంట కు మొత్తం 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం ఇప్పటి మార్కెట్ ప్రకారం వాటి విలువ రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనున్నారు. అంతే కాకుండా అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించినట్టు సమాచారం.