Site icon HashtagU Telugu

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి టిక్ టాకర్ ప్రపోజల్.. నాలుగో భార్యనవుతా అంటూ?

Imran Khan

Imran Khan

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలి గారు. ఇక అప్పటినుంచి రాజకీయపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. వరుసగా కేసులు, అరెస్టులు అంటూ ఇమ్రాన్ ఖాన్ సతమతమవుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో ఆయనకు అనూహ్య ప్రతిపాదన ఎదురైంది. యూకేకు చెందిన ఒక టిక్‌టాకర్‌ ఆయనకు ప్రపోజ్‌ చేసింది. ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని, ఆయనకు నాలుగో భార్యనవుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక కూడా చక్కర్లు కొడుతోంది. యూకేకు చెందిన జియా ఖాన్‌ అనే టిక్‌టాకర్‌ ఈ ప్రతిపాదన చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ముందు జెమీమాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఒక జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఒక సంప్రదాయబద్ధమైన మహిళను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్‌ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో అల్లరి చేసే సరదాలు పంచే భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నాను. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్‌ ఖాన్‌ అని జియా ఖాన్‌ ఆ వీడియోలో పాక్‌ మాజీ ప్రధానిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బుష్రా బీబీతో ఇమ్రాన్ వివాహం చెల్లదని ఇటీవల ఒక మతపెద్ద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్‌ స్పందించలేదు. ఇక, 100కు పైగా కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ను ఇటీవల పాక్‌ పారామిలటరీ విభాగం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు.