Site icon HashtagU Telugu

UGC NET 2024: యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్ర‌క‌టన‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎన్టీఏ..!

UGC NET 2024

UGC NET 2024

UGC NET 2024: పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. NTA మూడు ముఖ్యమైన పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిలో యూజీసీ-నెట్‌ (UGC NET 2024) జూన్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయింద‌నే అనుమానంతో ప‌రీక్ష ముందురోజు ర‌ద్దు చేశారు. ఇప్పుడు దాని పునః నిర్వహణ తేదీ విడుదల చేశారు అధికారులు. తేదీలు ప్రకటించిన ఇతర మూడు పరీక్షలలో జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ 2024 పరీక్ష, ఎన్‌సీఈటీ 2024 పరీక్ష, AIAPGET 2024 పరీక్ష కూడా ఉన్నాయి.

యూజీసీ-నెట్ 2024 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 4 మధ్య జరుగుతుంది

ఎన్టీఏ శుక్రవారం రాత్రి కొత్త షెడ్యూల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిలో యూజీసీ-నెట్ 2024 పరీక్ష ఇప్పుడు 21 ఆగస్టు నుండి 4 సెప్టెంబర్ మధ్య నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈసారి పరీక్ష పేపర్-పెన్ ఫార్మాట్‌లో ఉండదు. కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్ పరీక్షకు హాజరు కావాలి. జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ 2024 పరీక్ష, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలను కూడా ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

Also Read: MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్

ఎన్టీఏ విడుదల చేసిన షెడ్యూల్ ఇదే

మీరు ఇక్కడ మరింత సమాచారాన్ని పొందవచ్చు

ఎన్టీఏ పరీక్షల షెడ్యూల్ గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే మీరు అధికారిక వెబ్‌సైట్ www.nta.ac.inని తనిఖీ చేయ‌వ‌చ్చ‌ని NTA అభ్యర్థులకు సూచించింది. ఇది కాకుండా, అభ్యర్థులు ఫోన్ నంబర్ 011-40759000కి కాల్ చేయవచ్చు లేదా సంబంధిత పరీక్షల ఇమెయిల్ ఐడిని కూడా పంపవచ్చు (ncet@nta.ac.in, csirnet@nta.ac.in, ugcnet@nta.ac.in లేదా aiapget@nta.ac.in మెయిల్ ద్వారా ప్ర‌శ్న‌ల‌ను అడగవచ్చు).

We’re now on WhatsApp : Click to Join

యూజీసీ నెట్‌ పరీక్ష ఈ నెల 18వ తేదీన నిర్వహించారు. ఇందులో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఒక రోజు తర్వాత జూన్ 19న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే UGC-NETని రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ థ్రెట్ యూనిట్ ఎన్‌సిటిఎయు పరీక్షలో అవకతవకలకు సంబంధించిన ఇన్‌పుట్‌లను అందుకోవ‌డంతో ర‌ద్దు చేసింది.