Uganda: ఉగాండా మంత్రిని తన సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపాడు. అనంతరం ఆ సెక్యూరిటీ కాల్చుకుని చనిపోయాడు. వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తుంది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఉగాండాలోని కార్మిక శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్న రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలాపై మంగళవారం ఉదయం అతని ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. మంత్రిని కాల్చే ముందు సెక్యూరిటీ గార్డ్ గాల్లో కాల్పులు జరిపినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డట్టు ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. కల్నల్ ఎంగోలా ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి. ఆయన గతంలో రక్షణ శాఖకు ఉప మంత్రిగా పనిచేశారు. కాగా.. ఉగాండా పార్లమెంటు స్పీకర్ ఉదయం సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఒక ప్రకటనలో కల్నల్ ఎంగోలా మరణాన్ని ధృవీకరించారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీలతో మౌనం పాటించారు.
Read More: GST Records: జీఎస్టీలో భారత్ రికార్డు.. గుడ్ న్యూస్ అంటూ మోడీ ట్వీట్!