Site icon HashtagU Telugu

Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Uganda

Resizeimagesize (1280 X 720) 11zon

Uganda: పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఉగాండా పోలీసులు శనివారం వెల్లడించారు. తూర్పు కాంగోలో ఉన్న ఉగాండా గ్రూపునకు చెందిన అలైడ్ డెమొక్రాటిక్ ఫోర్సెస్ (ADF) సభ్యులు జూన్ 16 చివర్లో ఎంపాండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా హాస్టల్‌కు నిప్పు పెట్టి ఆహారాన్ని కూడా దోచుకెళ్లారు. ట్విట్టర్ లో ఈ సమాచారాన్ని ఇస్తూ ఉగాండా పోలీసులు ఇప్పటివరకు పాఠశాల నుండి 25 మృతదేహాలను స్వాధీనం చేసుకుని బవేరా ఆసుపత్రికి పంపారు. బవేరా ఆసుపత్రిలో ఎనిమిది మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.

ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని పశ్చిమ ప్రాంతంలోని ఓ పాఠశాలపై ఐసిస్ అనుబంధ ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 25 మంది విద్యార్థులు మరణించినట్లు సమాచారం. ఈ సంఘటన జూన్ 16 అర్థరాత్రి జరిగింది. ఉగాండాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎంపాండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మంది మరణించినట్లు ఉగాండా పోలీస్ ఫోర్స్ తెలిపింది.

Also Read: Nepal President: నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో అడ్మిట్

మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు..?

మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయిన దుండగులను సైనికులు వెంబడిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌లో ADF తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక గ్రామంపై దాడి చేసి కనీసం 20 మందిని చంపింది. ఉగాండా ADFతో పోరాడటానికి కాంగోకు దళాలను పంపింది.