Site icon HashtagU Telugu

Balakrishna: ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి : నందమూరి బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Balakrishna: తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలని అన్నారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని అన్నారు. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం వసంత రుతువులో చిరుగులా చిగురించాలని బాలయ్య కోరారు.

అయితే హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇక్కడ ఓటమి అంటే తెలియదు. అందువల్ల రాను రానూ హిందూపురం కాస్త నందమూరి పురం అన్నట్లుగా మారిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014 నుంచి హిందూపురం నుంచి పోటీ చేస్తూ నెగ్గుతున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి 2024 లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.