సీఎం జగన్‌కి సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి బయటికి వచ్చిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల చెంతకు మరో ఎమ్మెల్యే చేరుతున్నారు. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసినట్లు అనుమానిస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు అధిష్టానానికి అందుబాటులో రాలేదు. నిన్న ఓటు వేసిన వెంటనే ఆయన బెంగుళూరు వెళ్లినట్లు సమాచారం. తాజాగా ఆయన క్యాంప్ ఆఫీసులో వైసీపీ కండువాలతో ఉన్న ఫ్లెక్సీలను అనుచరులు తొలిగిస్తున్నారు. దీంతో వైసీపీ భావించినట్లు నిన్న ఓటింగ్ లో మేకపాటి టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు స్పష్టమైంది.
YCP MLA : ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసులో ఫ్లెక్సీల తొలిగింపు.. అందుబాటులో లేని ఎమ్మెల్యే మేకపాటి
సీఎం జగన్‌కి సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి బయటికి వచ్చిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

Mekapati
Last Updated: 24 Mar 2023, 10:47 AM IST