Indian Youth Congress president: ఉదయ్ భాను చిబ్‌ను యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు శ్రీనివాస్ బివి సహకారాన్ని పార్టీ అభినందిస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Hydraa : హైడ్రా కూల్చివేతలు..సామాన్య ప్రజల రోదనలు
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఉదయ్ భాను చిబ్ గతంలో జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్‌కు చీఫ్‌గా పనిచేశారు. అదేవిధంగా జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఉదయ్ భాను చిబ్‌ను కలిసిన కొద్ది రోజుల తర్వాత తాజాగా ప్రకటన వెలువడటం ఆసక్తిగా మారింది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉదయ్ భాను చిబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా ప్రముఖ పాత్ర వహిస్తారని నియమించినట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో కూడా చిబ్ పనిచేశారు.
కాగా, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో ముందస్తు ఎన్నికల పొత్తుతో ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతోంది. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్‌సీ 52 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేయనుంది.