Uber Brother: నన్ను అన్నా, అంకుల్ అని పిలవద్దంటూ క్యాబ్ డ్రైవర్ విజ్ఞప్తి.. నెటిజన్స్ సెటైర్స్!

మనం ఎప్పుడైనా బయటికి వెళ్లాలి అనుకుంటే మన సొంత వాహనాలు ఉంటే బయటికి వెళ్తాం. ఒకవేళ సొంత వాహనాలు లేకపోతే బయట క్యాబ్ లేదా ఆటోలో వెళ్తాం. ఇలా క్యాబ్ లేదా ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్లను మనకంటే చిన్నవాడు అయితే బాబు లేదంటే పేరు పెట్టి పిలుస్తాం.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 06:55 AM IST

మనం ఎప్పుడైనా బయటికి వెళ్లాలి అనుకుంటే మన సొంత వాహనాలు ఉంటే బయటికి వెళ్తాం. ఒకవేళ సొంత వాహనాలు లేకపోతే బయట క్యాబ్ లేదా ఆటోలో వెళ్తాం. ఇలా క్యాబ్ లేదా ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్లను మనకంటే చిన్నవాడు అయితే బాబు లేదంటే పేరు పెట్టి పిలుస్తాం. ఆ వ్యక్తితో పరిచయం లేకపోతే అన్న లేదంటే భయ్యా, బాబు ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇక ఏజ్ లో పెద్దవారు అయితే అంకుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా పిలవడం చాలా మందికి నచ్చదు.

మరీ ముఖ్యంగా యూత్ వాళ్ళకి ఇలా పిలవడం అస్సలు నచ్చదు. అలా పిలిచినప్పుడు వాళ్లకు నచ్చకపోగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక డ్రైవర్ అలాంటి వ్యక్తి అని చెప్పవచ్చు. కారణం ఏంటి అన్నది తెలియదు కానీ ఒక క్యాబ్ డ్రైవర్ తనని మాత్రం అంకుల్ అన్నా పిలవద్దు అంటూ కారు ఎక్కే ప్యాసింజర్స్ కి విజ్ఞప్తి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక క్యాబ్ డ్రైవర్ తన కారులోని ముందు సీటు వెనుక భాగంలో నన్ను భయ్యా లేదా అంకుల్ అని పిలవొద్దు అని రాశాడు.

దానిని ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌ పై నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు కారు ఎక్కి భయ్యా అని పిలిచినందుకు మనోడు హర్ట్ అయి ఉంటాడు అందుకే అలా విజ్ఞప్తి చేస్తున్నాడు అని కొందరు కామెంట్స్ చేస్తుండ. ఆ రిక్వెస్ట్ అమ్మాయేలకోసమేనా? అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క నెటిజన్ ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.