IRCTC Rules: బుక్ చేసుకున్న రైలు టికెట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మీకు తెలుసా?

కొన్ని సందర్భాల్లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు అకస్మాత్తుగా రద్దు చేసుకోవలిసి వస్తుంది. అలాంటి సమయంలో

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 10:10 PM IST

కొన్ని సందర్భాల్లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు అకస్మాత్తుగా రద్దు చేసుకోవలిసి వస్తుంది. అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియక చాలా తికమక పడుతూ ఉంటాము. ఇక చివరికి చేసేదేమి లేక టికెట్ ను క్యాన్సల్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ట్రైన్ టికెట్ బుక్ చేసే సమయంలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.

అయితే ఇలా క్యాన్సిల్ చేసుకునే సమయంలో కొన్ని సార్లు డబ్బులు చెల్లించిన మొత్తం తిరిగి రాకపోవడం లేదా కొన్ని సార్లు అసలు డబ్బులు మొత్తమే రిటర్న్ రాకపోవడం చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి సమస్యలు లేకుండా మన టికెట్ ని బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇలా బదిలీ అంటే ఎవరికీ పడితే వారికి కాదండోయ్. దీనికి కూడా ఖచ్చితంగా ఏవో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు టికెట్ ని ఎవరికీ పడితే వారికి బదిలీ చేయకూడదు. మీ కుటుంబ సభ్యుల్లో భర్త, భార్య, తల్లి,తండ్రి, సోదరుడు, సోదరి ఇలా వీరిలో ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైలు బయలుదేరే 24 గంటల ముందే భారతీయ రరైల్వేస్ కి రిక్వెస్ట్ పంపవలిసి ఉంటుంది. ఆ సమయంలో అధికారులు టికేట్ పైన మీ పేరును తీసివేసి ఎవరికీ బదిలీ చేస్తున్నారో వారి పేరు ని ఆడ్ చేస్తారు. కుటుంబ సభ్యులలోనే కాకుండా ఇంకో సౌలభ్యం కూడా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణ లో బాగంగా ఆ టికెట్ ను వేరే ఉద్యోగికి బదిలీ చేసుకోవచ్చు.

విదార్థులు మరో విదార్థికి కూడా ఈ టికెట్ ని బదిలీయే చేసుకోవచ్చు కానీ ఆ విద్యాసంస్థ ప్రభుత్వ గుర్తింపు పొందినదిగా ఉండాలి. అలాగే విదార్థి ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కి ఈ విషయం పై 48 గంటల ముందే రిక్వెస్ట్ ని పెట్టుకోవాలి. టికెట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుగా మీరు టికెట్ ని ప్రింట్ తీసుకోవాలి. ఎవరికీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వారికీ సంబందించిన గుర్తిపు కార్డుని జోడించి మీకు దగ్గరలోని రైల్వే స్టేషన్ లో ఫారం నింపి ఇవ్వాలి. ఇలా చేసి మీ టికెట్ ని బదిలీ చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఇలా టికెట్ ని క్యాన్సిల్ చేసుకోకుండా బదిలీ చేసే పద్ధతి మాత్రం చాలా బాగుంది కదూ..