Site icon HashtagU Telugu

Aircraft tyre bursts: థాయ్ ఎయిర్‌వేస్ విమానానికి ప్ర‌మాదం.. టైర్ పేల‌డంతో…?

Tha Airways Imresizer

Tha Airways Imresizer

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ముందు థాయ్ ఎయిర్‌వేస్ విమానం టైర్ పేలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా,.. బుధవారం సాయంత్రం స్పేర్ వీల్‌తో ఎయిర్‌లైన్స్‌కు చెందిన టెక్నికల్ టీమ్ వచ్చారు. ఈ విమానం గురువారం బెంగళూరు నుంచి బ్యాంకాక్‌కు వెళ్తుందని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి. 256-సీట్ల విమానం TG 325, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, బ్యాంకాక్ నుండి బయలుదేరి 11.32 గంటలకు బెంగళూరులో ల్యాండ్ అయింది.

మంగళవారం బెంగళూరులో టైరు పగిలినప్పటికీ విమానం టార్మాక్‌పై సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు వివరించాయి. గాలిలో పేలుడు సంభవించిందని, అయితే పైలట్ల దృష్టికి వచ్చిందని నిపుణులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారని బెంగళూరు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. విమానంలోని ప్ర‌యాణికుల‌ను దింపిన తర్వాత, విమానాన్ని తనిఖీకి తరలించారు. విమానం బుధవారం బెంగళూరు నుంచి బ్యాంకాక్‌కు టేకాఫ్‌ కావాల్సి ఉండగా, ఈ ఘటనతో ట్రిప్‌ క్యాన్సిల్‌ అయిందని సంబంధిత వర్గాలు వివరించాయి.