Site icon HashtagU Telugu

Ganja Smuggling: గంజాయి స్మ‌గ్లింగ్‌లో మైన‌ర్లు… కొత్త‌గూడెంలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌

Ganja Imresizer

Ganja Imresizer

కొత్త‌గూడెంలో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ ఇద్ద‌రు మైన‌ర్ యువ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీసులు 4 ఇంక్లైన్ ప్రాంతంలో 4.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా బేగం, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో యువకులు మోటర్‌బైక్‌పై వెళుతుండగా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి వారిని ఆపారు. పోలీసులు తనిఖీ చేయగా యువకుల వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

విజయవాడలోని వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన ఆర్‌ హేమంత్‌కుమార్‌ అనే నిందితుడు మైనర్‌ బాలుడితో కలిసి గంజాయిని విజయవాడలో విక్రయించేందుకు సీలేరు మండలం డొంకరాయి గ్రామంలో కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. మోటారు బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.77,760 ఉంటుందని ఎస్ ఐ లావుడ్యరాజు తెలిపారు.