Karnataka: బోరుబావిలో రెండేళ్ల బాలుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు

కర్ణాటకలోని ఇండి పట్టణం లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Karnataka: కర్ణాటకలోని ఇండి పట్టణం లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆడుకోవడానికి ఇంటి బయటకు వెళ్లిన చిన్నారి ప్రమాదశావత్తు బోరుబావిలో పడిపోయాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

We’re now on WhatsAppClick to Join.

సాయంత్రం 6.30 గంటలకు రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సంఘటనా స్థలంలో పోలీసు బృందాలు, రెవెన్యూ అధికారులు మరియు అగ్నిమాపక అధికారులు ఉన్నారు. చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బాలుడు దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాలుడి స్వరం వినిపించడం లేదు, కానీ బోర్‌వెల్ లోపల కొంత కదలిక ఉన్నట్టు చెప్తున్నారు. బాలుడికి ఆక్సిజన్ పైపుల ద్వారా పంపించడం జరిగింది. దీంతో బాలుడిలో కదలిక కనిపించినట్లు అధికారులు పేర్కొన్నార. ప్రస్తుతానికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి అని తెలిపారు.

Also Read: Family Star Censor Talk : ‘ఫ్యామిలీ స్టార్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్