Site icon HashtagU Telugu

Telugu States: నేడే త్రిసభ్య కమిటీ సమావేశం.. అజెండాలో అంశాలు ఇవే..!

Ap Telangana

Ap Telangana

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభ‌జ‌న అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన సమన్యలపై ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం జ‌ర‌గ‌నుంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం, ఇటీవ‌ల‌ త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలసిందే. ఈక్ర‌మంలో నేడు కమిటీ వర్చువల్‌గా సమావేశమై ప‌లు కీల‌క విష‌యాలు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొత్తం ఐదు అంశాలపై చర్చించాలని అజెండాలో ఖరారు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఏపీ ఆర్థిక సంస్థ విభజన, ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, తెలంగాణ డిస్కంలకు సంబంధించి రావాల్సిన బకాయీలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు, డిపాజిట్ల పంపిణీ పై ఈరోజు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్ర‌ హోంశాఖ సహాయ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చీఫ్ సెక్రటరీలు ఈ త్రిస‌భ్య క‌మిటీ భేటీలో పాల్గొననున్నారు. మ‌రి విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డ్డ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం దొరుకుందో లేదో చూడాలి.