Site icon HashtagU Telugu

Andhra Pradesh: ప్రాణం తీసిన అభిమానం..

Andhra Pradesh

New Web Story Copy (3)

Andhra Pradesh: సినీ తరలంటే అభిమానం ఉండాలి కానీ ప్రాణాలు తీసుకునే అంత అభిమానం ఉండకూడదు. సినిమా హీరోల కోసం కొట్టుకోవడం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో గొడవలు ముదిరి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. మరోవైపు తమ అభిమాన నటుల ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది.

ఈ రోజు ఆదివారం జూలై 23న ప్రముఖ నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఇద్దరు యువకులు సూర్య బ్యానర్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటనలో నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా మరణించారు. గత అర్ధరాత్రి సూర్య ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీకి ఉన్న ఐరన్ ఫ్రేమ్ ఆ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు డిగ్రీ సెకండియర్ చదువుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Also Read: Trump Defeat Biden : ఇప్పుడు ఎన్నికలైతే ట్రంప్ గెలుపు, బైడెన్ ఓటమి..సంచలన సర్వే రిపోర్ట్