దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మెట్రో ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని అన్ని రూట్లలో సీల్ చేసిన రెండు మద్యం బాటిల్స్ (alcohol bottles) తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఈ ప్రకటన విడుదలైంది. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force), డీఎంఆర్ఎసీ సభ్యులతో కూడిన కమిటీ గత ఆదేశాలను సమీక్షించి తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.
డీఎంఆర్సీ తన ప్రకటనలో ఇంకా ఇలా పేర్కొంది. సీఐఎస్ఎఫ్, డీఎంఆర్సీ అధికారులతో కూడిన కమిటీ మునుపటి ఆర్డర్ ను సమీక్షించింది. మునుపటి ఆర్డర్ ప్రకారం.. ఎయిర్ పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మినహా ఢిల్లీ మెట్రోలో మద్యం రవాణా నిషేధించబడింది. తాజా ప్రకటనలో.. ఢిల్లీలోని అన్ని మెట్రో లైన్‌లలో రెండు సీల్ వేయబడిన మద్యం బాటిల్స్‌ను తీసుకువెళ్లొచ్చని తెలిపింది. అయితే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. మెట్రో ప్రయాణించే సమయంలో ఎవరైనా మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీఎంఆర్సీ ప్రకటనలో పేర్కొంది.
Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro.
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) June 30, 2023
ఢిల్లీ మెట్రోలో నిషేధించబడిన వస్తువులలో ఏవైనా ప్రమాదకరమైన వస్తువులు, పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన వస్తువులు, డిసేబుల్ కెమికల్స్, తుపాకులు, ఇతర ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళ్లడం నిషేధం అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.