Site icon HashtagU Telugu

AP Road Accident: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 10 మందికి తీవ్ర గాయాలు

Rtc

Rtc

కడప జిల్లా ఖాజీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం మలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సులో ఉన్న డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోగా స్థానికులు బయటికి తీశారు. వారితో పాటు మరో బస్సు డ్రైవర్ కు పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఖాజీపేట ఎస్సై కులాయప్ప పోలీసు వాహనంలో హుటాహుటిన గాయపడ్డ వారిని కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ ను అంతా క్లియర్ చేసి వాహనాలను పంపించి వేశారు.