Site icon HashtagU Telugu

Hyderabad: నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు

Measures Of Money Supply In India

Measures Of Money Supply In India

Hyderabad: SOT శంషాబాద్‌ టీం మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలోని మెహఫిల్‌ రెస్టారెంట్‌లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. గంగరాజా మరియు అభినందన్ లది చిత్తూరు జిల్లా.  వీరు ఇద్దరు 500 రూపాయల నోట్ల కట్టలలో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసం చేస్తుంటారని తెలిపారు. వారి వద్దనుండి 6.62 లక్షల విలువ చేసే 500 రూపాయల 10 కట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఇద్దరూ చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందినవారు. ఈ కేసులో గంగరాజు ప్రధాన నిందితుడు
అభినందన్‌ రెండో నిందితుడు.  గంగరాజు స్టాక్ బ్రోకరేజ్ బిజినెస్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నాడు. అందుకే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 2 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచివ్ పవార్ & సురేష్ పవార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నకిలీ కరెన్సీ వీడియో ను చూసి, వారిని సంప్రదించి Vedio కాల్స్ ద్వారా నిర్ధారించుకున్నారు. నకిలీ 500 రూపాయల నోట్లను 1:5 నిష్పత్తిలో సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయారు.