Site icon HashtagU Telugu

2 Killed: ఢిల్లీలో విషాదం..ఇంటిపైక‌ప్పు కూలి ఇద్ద‌రు మృతి

Deaths

Deaths

ఢిల్లీలో విషాదం నెల‌కొంది. ఇంటి పైక‌ప్పు కూలి కుటుంబంలోని ఇద్ద‌రు మృతి చెంద‌గా.. న‌లుగురు చిన్నారుల‌కు గాయాలైయ్యాయి.ఈ ఘ‌ట‌న సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ మహల్ ప్రాంతంలో జ‌రిగింది. ఘ‌ట‌న‌పై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న న‌లుగురిని రెస్క్యూ చేసి కాపాడారు. న‌లుగురికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చిన‌పోయిన ఇద్ద‌రిని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పైక‌ప్పు కూల‌డానికి గ‌ల కార‌ణాలేంటి అనే కోణంలో విచార‌ణ జ‌రుగుతుంది.